తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో నిన్న ఉదయం జరిగిన ఘటనలపై ఇవాళ కూడా సభలో వాగ్యుద్ధం జరిగింది. స్పీకర్ ప్రసాద్ కుమార్ జోక్యం చేసుకుని.. హరీశ్ రావు వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. “మహిళా సభ్యులంటే సభతో పాటు నాకు కూడా గౌరవం ఉంది. మీరు చెబితే నేను వినట్లేదా.. ఎందుకంత ఆవేశం. మీకు కాదు ఆవేశం..నాకు ఉండాలి. తల్లిని అనలేదు.. నా తల్లిని అన్నారు” అని భావోద్వేగానికి గురయ్యారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత, కోవా లక్ష్మి పట్ల తనకు కూడా గౌరవం ఉందన్నారు.