మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ లో ఉదయం కార్తీక్ (40) అనే వ్యక్తి కారులో పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకోవడంతో సజీవదహనమయ్యాడు. ఉదయాన్నే వాకింగ్ చేస్తున్న స్థానికులు చూస్తుండగానే కారులో మంటలు క్షణాల్లో వ్యాపించి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు కార్తీక్ స్థానికంగా లాండ్రీ వ్యాపారం చేస్తూ తల్లితో కలిసి నివసిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు, గొడవలు జరుగుతుండటంతో భార్య, పిల్లలు గత రెండేళ్లుగా ఆయనకు వేరుగా ఉంటున్నారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.