లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ నందనను శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై గతంలోనే పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడంతో, ఎయిర్‌పోర్ట్‌కు రాగానే గుర్తించిన అధికారులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చట్టపరమైన విచారణ నిమిత్తం నందనను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.