స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు తెలంగాణలో ఇది చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ తాతా మధు సభ్య సమాజం సహించలేదని భాష వాడారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలగించాలని డిమాండ్ చేశారు. వ్యాఖ్యలపై చర్చ సందర్భంగా ఆందోళనలు చేస్తున్న బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ చీకటి మిత్రులను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.