మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఈజిప్టుకు చెందిన న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. స్థానిక టీవీ వ్యాఖ్యాత సారా ఖలీఫా (39) సహా 12 మందికి మరణశిక్ష విధించింది. మరో తొమ్మిది మంది దోషులకు జీవిత ఖైదు విధించగా.. ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులు విదేశాల నుంచి ముడిపదార్థాలను దిగుమతి చేసుకోవడం, స్థానికంగా సింథటిక్ డ్రగ్స్ తయారు చేయడం, వాటిని విక్రయించడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు.