బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానం ఆదివారం ఉదయం 8.20 గంటలకు లండన్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించిన పైలట్లు విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. విమానాన్ని అరగంటకుపైగా గాల్లో చక్కర్లు కొట్టించారు. అనంతరం వెనక్కి తీసుకువచ్చి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో సిబ్బంది సహా మొత్తం 270 మంది ప్రయాణికులు ఉన్నారు.