విజయవాడలోని ఆటోనగర్‌లో ఉన్న హ్యుందాయ్ కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం షోరూంకు సెలవు కావడంతో పెను ప్రాణనష్టం తప్పింది. భవనం పైఅంతస్తు నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. క్షణాల్లోనే మంటలు భవనం పైఅంతస్తును పూర్తిగా చుట్టుముట్టాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకోవడంతో సమీప నివాసితులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.