మరికొన్ని గంటల్లో పెళ్లి.. భాజాభజంత్రీలు మోగాల్సిన వేళ.. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు స్నేహితులు, బంధువులతో కలిసి సరదాగా బయటకు వెళ్లాడు. అయితే అదే అతని చివరి ప్రయాణమైంది. కొత్తగా విడుదలైన కృష్ణా జలాల పరవళ్లను చూసేందుకు వెళ్లి.. సరదాగా ఈత కొట్టేందుకు కాలువలోకి దిగిన వరుడితో పాటు మరో బంధువు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కాలువ వద్ద చోటుచేసుకుంది.