దిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఓ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో భవనం లోపల దాదాపు 50 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భవనాన్ని వసతి గృహంగా వినియోగిస్తున్నట్లు భోగట్టా. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.