ZEE గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రపై CBI తీవ్రమైన క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు సుభాష్ చంద్రతో పాటు మరికొందరిపై సిబిఐ FIR దాఖలు చేసింది. తప్పుడు మరియు నకిలీ పత్రాలను సృష్టించి తన నికర ఆస్తి (నెట్‌వర్త్) విలువను ఏకంగా రూ. 59,113 కోట్లుగా చూపింంచి, అనుబంధ కంపెనీలకు రూ. 1,322 కోట్ల మేర రుణాలను ఇప్పించి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ను మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.