నేడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ బీజేపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి పై సెటైరికల్ ఏఐ వీడియో (Al Video)ను పోస్ట్ చేశారు. ఇందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ లను కూడా చేర్చారు. మోసాలు చేయడంలో పప్పు క్లాసులు, తూచ తప్పకుండా పాటిస్తున్న శిష్యులు అంటూ దీనికి క్యాప్షన్ జోడించారు.