ఖజాగూడ హిట్ అండ్ రన్ కేసుల నిందితుడిగా ఉన్న ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు 23 ఏళ్ల బి. శివ సందీప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఆర్టీఏ అధికారులను కోరారు. ఈ మేరకు మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ ఆర్టీఏ అధికారులకు లేఖ రాశారు. మరోవైపు సందీప్ రక్త నమూనాలను పరీక్షించగా ప్రాథమిక పరీక్షలో డ్రగ్స్‌కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు తెలిపారు. అయితే తుది నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.