సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు నీటి విడుదల షెడ్యూల్‌ను ఈ నెల 14లోపు ప్రకటించాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్దేశిత గడువులోగా షెడ్యూల్ ప్రకటించకపోతే కోదాడ నుంచి హాలియా వరకు వేలాది మంది రైతులతో పాదయాత్ర చేపడతానని గురువారం మిర్యాలగూడలో బిఆర్‌ఎస్ నిర్వహించిన రైతు మహాధర్నాలో హెచ్చరించారు. కాంగ్రెస్‌కు ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చిన ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.