మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం ఊహించని విధంగా బిగ్ షాక్ ఇచ్చింది. గురువారం సాయంత్రంలోపు మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఆమెకు హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అధిష్ఠానం ఆదేశాలను కాదని సురేఖ రాజీనామా చేసేందుకు ససేమీరా అంటే.. ఏమాత్రం ఉపేక్షించకుండా ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసేందుకు కూడా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్కు లేఖ పంపుతామని హైకమాండ్ స్పష్టం చేసింది.