తితిదే డిప్యూటీ ఈవో లోకనాథంను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు.
బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు లోకనాథం ఇల్లు, కార్యాలయాల్లో చేసిన సోదాలు ముగిసిన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. లోకనాథం ఇంట్లో రూ. 5 కోట్ల విలువైన ఆస్తులు, 2 కిలోల బంగరాం, 6.5 కిలోల వెండి, రూ.12లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నారు.