మీడియా కథనాల ప్రకారం.. ‘బిగ్ బాస్’ 20వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించినందుకు సల్మాన్ ఖాన్ సుమారు రూ.120 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. మొదట్లో ఎపిసోడ్‌కు రూ.2.5 కోట్లు తీసుకున్న సల్మాన్, సీజన్ సీజన్‌కు తన పారితోషికం పెంచుకుంటూ వచ్చారు. బిగ్ బాస్ 18 నాటికి ఆయన రెమ్యునరేషన్ రూ.250 కోట్లకు చేరిందని అప్పట్లో వార్తలొచ్చాయి. సల్మాన్ రెమ్యునరేషన్ గురించి నిర్మాత రిషి నేగిని అడగ్గా.. నటీనటులతో కాంట్రాక్టులు వ్యక్తిగత విషయమని, వాటిని బయటపెట్టలేమని ఆయన స్పష్టం చేశారు.