బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. ఆర్మీ కంటోన్మెంట్ పరిసరాల్లోని ఫైరింగ్ క్యాంప్ దగ్గర 160 డిటోనేటర్లు లభ్యమయ్యాయి.. బకెట్‌లో దుండగులు డిటోనేటర్లను అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. బకెట్‌లో 8 బండిల్స్ డిటోనేటర్లు లభ్యమయ్యాయి.. ఒక్కో బండిల్‌లో 20 డిటోనేటర్ల గుర్తించారు. ఆయుధాలు మిస్సింగ్ కేసులో తనిఖీలు చేస్తుండగా డిటోనేటర్ల వ్యవహారం బయటపడింది. ఇటీవలనే ఏకే 47 తుపాకులు సహా.. పలు పిస్టోళ్ల చోరీ కలకలం రేపిన విషయం తెలిసిందే..