ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతున్నట్లు
తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇక ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో సెప్టెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.