తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి కొండా సురేఖ పార్టీ నాయకులకు మరియు హైకమాండ్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తనపై ఏవైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే బీసీ వర్గాలన్నీ ఒక్కటవుతాయని ఆమె స్పష్టం చేశారు. పార్టీలో అందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తించాలని, కేవలం తనను మాత్రమే టార్గెట్ చేయడం సరికాదని ఆమె ఘాటుగా బదులిచ్చారు. తనకంటే ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రెడ్డి వర్గానికి చెందిన నాయకులపై ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కొండా సురేఖ సూటిగా ప్రశ్నించారు.