మమితా బైజు బాక్సాఫీస్ వద్ద అత్యంత అరుదైన మైలురాయిని అందుకున్నారు. కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే ఆమె నటించిన మూడు విభిన్న చిత్రాలు ఒక్కొక్కటి రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించాయి. ఒకే కథానాయిక నటించిన మూడు వరుస చిత్రాలు ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఇదే తొలిసారి. రూ.300 కోట్ల ‘జననాయగన్’ రూ.240 కోట్లు రాబట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’, రూ.200 కోట్ల క్లబ్లో చేరిన ‘బెత్లహోమ్ కుటుంబ యూనిట్’ చిత్రాలతో సరికొత్త రికార్డుగా నమోదైంది.

