కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, వాటికి న్యాయపరమైన భరోసా కల్పించిన సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా సెప్టెంబర్ 5న నిర్వహించ తలపెట్టిన ర్యాలీని ఉపసంహరించుకుంటున్నట్లు సిజెపి సహ కన్వీనర్ సౌరవ్ దాస్ ప్రకటించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట హాజరై, సంస్థ తరఫున ఆయన ఈ ప్రకటన చదివి వినిపించారు. కోర్టు ఆదేశాలు అమలవుతాయని ఆశిస్తున్నామని, ఈ నిర్ణయానికి సహకరించిన న్యాయస్థానానికి, ఇరుపక్షాల న్యాయవాదులకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను కొనసాగించబోమన్న హామీలను కేంద్రం గౌరవిస్తుందని స్పష్టం చేశారు.