రిలయన్స్ రిటైల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ ఐస్ క్రీమ్ వ్యాపారంలోకి అధికారికంగా అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. ‘బాంబే క్రీమెరీ’ (Bombay Creamery) బ్రాండ్ పేరుతో ప్రీమియం కేటగిరీ ఐస్ క్రీమ్‌లను మార్కెట్లోకి తేనున్నట్లు వెల్లడించింది. స్వచ్ఛమైన పాలు, అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ప్రపంచ స్థాయి ఐస్ క్రీమ్ అనుభూతిని భారతీయులకు అందిస్తామని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రిలయన్స్ సంస్థ రూ. 10 ప్రారంభ ధరకే ఈ ఐస్ క్రీమ్‌లను అందుబాటులోకి తేస్తుండటం విశేషం.

