ఎసీసీవో సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిజిస్థాన్లోని బిష్కెక్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో భేటీ అయ్యారు. పశ్చిమాసియా యుద్ధం మొదలైన అనంతరం వీరిద్దరూ భేటీ కావడం ఇదే తొలిసారి. “ఇరువురు నేతలు పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను సమీక్షించారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలన్న భారత వైఖరిని ప్రధాని చాటిచెప్పారు. శాంతిస్థాపనకు, నౌకాయాన, వాణిజ్య స్వేచ్ఛను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు” అని భారత విదేశాంగశాఖ తెలిపింది.

