వైఎస్సార్సీపీలో ఎలాంటి కోటరీ లేదని, పార్టీలో నెంబర్ 2, 3 కూడా లేరని.. సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న సాయిరెడ్డికి జగన్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని తెలుసన్నారు. వైఎస్సార్ హయాంలోనే తిరుమలలో అన్యమతస్తుల ఉద్యోగాలపై చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. నిజంగానే వైఎస్ కుటుంబానికి మతమార్పిడుల అజెండా ఉంటే దశాబ్దాలుగా వారితో ఉన్న సాయిరెడ్డికి కూడా మతమార్పిడి జరిగి ఉండేదని ఎద్దేవా చేశారు. కొత్త పార్టీ పెట్టుకునేందుకు జగన్పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.