ఇప్పటికే జల ప్రళయంతో వణికిపోతున్న నేపాల్ వాసులకు మరో ప్రకృతి విపత్తు ఎదరైంది. నేపాల్- చైనా సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది.చైనాలోని సిచూవాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ఇళ్లలో ఉన్న జనాలు భయంతొ బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్ర 5.1గా నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు.