తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెంబడిపాళెంలోని 71వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టిసి బస్సు ఢీకొనడంతో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. నలుగురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. సిఐ ఆదిలక్ష్మి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు కర్నాటకకు చెందినదిగా గుర్తించారు.