నేపాల్ ఎగువ పరీవాహక ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది.ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పాట్నాలోని సంకల్ప్ ఆడిటోరియంలో అత్యవసరం సమావేశం నిర్వహించారు. నేపాల్ నుంచి వరద నీరు వచ్చే ప్రమాదం పొంచి ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.బిహార్ లోని డ్యామ్ లు, కరకట్టలపై 24 గంటల నిఘా ఉంచాలని అధికారులను అప్రమత్తం చేశారు.ఈ వరదల కారణంగా గండక్ నదిలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.