కృష్ణా నది జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ హక్కులను కాపాడటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. పులిచింతల దిగువ భాగంలో తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనంగా చూస్తూ ఊరుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ పరిధిలో ‘మహాత్మాగాంధీ’ (కల్వకుర్తి) ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పంప్ హౌస్ నిర్మాణాలు, అలాగే రాజీవ్ (భీమా) ఎత్తిపోతల పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు