ఓ పాఠశాలలో హిజాబ్ ధరించేందుకు తనకు అనుమతి నిరాకరించడంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును ఇస్లాంపై దాడిగా అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు. ఇస్లాంకు ఏది అవసరమో, ఏది కాదో నిర్ణయించే అధికారం న్యాయమూర్తులకు లేదని ఒవైసీ అన్నారు. ఇది మా మతం, ఏది అవసరమో మేమే నిర్ణయిస్తాం, నిర్ణయించడానికి న్యాయమూర్తులు ఎవరు? ఇది మా మతంపై దాడి అని ఒవైసీ విమర్శించారు. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వు రాజ్యాంగంలోని 19, 25 అధికరణలకు విరుద్ధంగా ఉందన్నారు. ఆమె తలకు హిజాబ్ ధరిస్తోంది, మనసుకు కాదని తెలిపారు.