అమెరికాలోని ఫ్లోరిడాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మృతులలో నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్ అనే యువకుడు ఉన్నాడు. మూడు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం రాహుల్ అమెరికాకు వెళ్లాడు. మృతుల కుటుంబ సభ్యులు మృతదేహాలను స్వదేశానికి తీసుకరావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.