నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ఎస్సై శ్రీనివాసరావు తీరు వివాదాస్పదంగా మారింది. ప్రేమ వ్యవహారంలో అవంచకు చెందిన మహేందర్ అనే వ్యక్తిపై ఫిర్యాదు రావడంతో విచారణ పేరుతో పిలిచి మహేందర్‌ను ఎస్సై శ్రీనివాసరావు చితకబాదారు. మహేందర్ దాహం వేస్తుందని పోలీసులను అడగడంతో తనపై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపణ చేశాడు. ఎస్సై శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు సదరు యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశాడు.