నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో బుధవారం ఉదయం ఒక్కసారిగా ప్రకృతి ఉగ్రరూపం దాల్చింది. టిబెట్ వైపు నుంచి ఊహించని రీతిలో విరుచుకుపడిన భయంకరమైన ఆకస్మిక వరదలు నేపాల్‌లోని పలు గ్రామాలు, వంతెనలు, ప్రాజెక్టు స్థలాలను ముంచెత్తాయి. రసువా జిల్లా పరిధిలో ఉగ్రరూపంలో ప్రవహిస్తున్న నీటి ఉద్ధృతికి గ్రామాలు కొట్టుకుపోవడమే కాకుండా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించి తీమురే ఏరియా పోలీస్ స్టేషన్, శ్యాప్రు బెసి పోలీస్ పోస్ట్‌లతో పాటు సరిహద్దు భద్రతలో ఉన్న 9 మంది సాయుధ పోలీసు సిబ్బంది కొట్టుకుపోయి గల్లంతైనట్లు సమాచారం.