తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వద్ద పనిచేస్తున్న డ్రైవర్ అరెస్టయ్యాడు. తెల్లాపూర్‌లోని సుమంత్ నివాసం వద్ద పోలీసులు డ్రైవర్‌ను ఆదివారం అరెస్ట్ చేశారు. ఒక వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని తీవ్రంగా బెదిరించడమే కాకుండా, ఆయనపై ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేసిన ఘటనపై ఇదివరకే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ దాడి కేసులో ప్రమేయం ఉన్నందున సుమంత్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.