మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో కునాల్ చాంద్‌గుడే (18) ఐఫోన్ కొనుగోలు చేశాడు.ఆర్థిక ఇబ్బందుల వల్ల తండ్రి మందలించడంతో కునాల్, ఖవాడ్యా కొండపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తండ్రి కొండ అంచున ఉన్న కొడుకును వెనక్కి లాగే ప్రయత్నంలో ఇద్దరూ కొండపై నుంచి లోయలోకి పడిపోయారు. కళ్లముందే భర్త, కొడుకు కిందపడిపోవడం చూసిన తల్లి తట్టుకోలేక కొండపై నుంచి కిందకు దూకేసింది. ఈ దారుణ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందగా, ఘటనకు సంబంధించిన వీడియోలు SMలో తీవ్రంగా వైరల్ అయ్యాయి.