కొండాపూర్‌లో ఏడంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం కుప్పకూలింది. అయితే శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో అగ్నిమాపక, పోలీసుల బృందం గాలింపు మొదలు పెట్టారు. నాలాను అనుకుని అక్రమంగా తక్కువ స్థలంలో ఏడు అంతస్తులతో నిర్మిస్తున్న భవన్ ఒక్కసారిగా కుప్పకూలి పక్కనే ఉన్న నిర్మాణాలు సైతం పాక్షికంగా కూలిపోయాయి. మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్య నగర్ లో 50గజాల స్థలం లో చేపట్టిన అక్రమ నిర్మాణం పూర్తిగా కుప్పగిలింది. పక్కనే ఉన్న హాస్టల్ లోని అందరూ పరుగులు తీసినట్టు సమాచారం.