కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు కారకుడైన రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్లు సమాచారం. గత అయిదు రోజులుగా నిందితుడిని పట్టుకునేందుకు పదిమంది ఎస్ఐలు సహా 40 మంది పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారు. శుక్రవారం పక్కా సమాచారంతో దిల్లీలో పోలీసు బృందాలు చేపట్టిన తనిఖీల్లో సాధిక్ చిక్కినట్లు తెలిసింది.