తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీ ప్రక్రియలో జరిగిన అవకతవకలకు సంబంధించిన అన్ని ఆధారాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఎవరికైనా స్పష్టత వస్తుందని జగన్ పేర్కొన్నారు.
అసెంబ్లీలో నారా లోకేష్ వ్యవహారశైలిని ఉద్దేశిస్తూ ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉందనే విషయం అందరికీ అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. తప్పులను అంగీకరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.