తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మంత్రి కూతురు కొండా సుస్మిత, సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఈ చర్యలు తీసుకుంది. ఈ వ్యాఖ్యలపై 3 రోజుల్లోగా స్పష్టమైన వివరణ ఇవ్వాలని టీపీసీసీ ఆదేశించింది. పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్న తర్వాత కొండా సుస్మితపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.