తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత , తమిళనాడు సీఎం జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివెల్ భేటీ ఆసక్తికరంగా మారింది. రాధన్ హైదరాబాద్లో కవిత ఇంటికి వెళ్లి కలిశారు.. ఆయన్ను కవిత, తన కుమారుడితో కలిసి సత్కరించారు. రాధన్ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి మరీ కవితను కలవడంపై చర్చనీయాంశమైంది. కవిత ఆయన్ను పిలపించారా.. ఆయనే ఇక్కడికి వచ్చారా అన్నది తెలియాల్సి ఉంది. కవిత తన రాజకీయ భవిష్యత్ గురించి ఏదైనా ఆరా తీశారా అనే చర్చ మొదలైంది.