పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వినుకొండ రోడ్డులోని ఎన్ఎస్బీ కార్ డెక్కర్లో సిబ్బంది వెల్డింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ కారుకు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో సిబ్బంది బయటకు వచ్చేశారు. మూడు కార్లకు మంటలు వ్యాపించాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆరుగురు సీఐలు, పోలీసు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనలో సుమారు రూ.50 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.