ఐఎస్ఐ మద్దతు కలిగిన షహజాద్ భట్టీ నెట్ వర్క్ అనే ఉగ్రవాద గ్రూప్ ను నాశనం చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే.. ఆ గ్రూప్ నకు చెందిన 200 మందికిపైగా సభ్యుల్ని అరెస్టు చేసినట్లు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. విధ్వంసకర దాడుల ప్రణాళికలను భగ్నం చేసినట్లు తెలిపారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ గ్రూప్ నుంచి ఐఈడీలు, పాకిస్థాన్ ఆయుధ ఫ్యాక్టరీ గుర్తులున్న గ్రెనేడ్లు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి” అని అమిత్ షా తెలిపారు.