భారత 80వ స్వాతంత్య్ర వేడుకలు అమెరికాలోని న్యూయార్క్ ట్రై-స్టేట్ ప్రాంతంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా న్యూజెర్సీలో జరిగిన ప్రత్యేక వేడుకల్లో ప్రపంచ రికార్డు నమోదైంది. క్వీన్స్‌లో జరిగిన ‘ఇండియా డే పరేడ్’లో న్యూయార్క్ నగర భారతీయ మూలాలున్న మేయర్ జోహ్రాన్ మమ్దానీ పాల్గొన్నారు. న్యూజెర్సీలోని పార్సిప్పనీలో వెటరన్స్ మెమోరియల్ పార్క్‌లో ‘లార్జెస్ట్ ఫ్లాగ్‌పోల్ నంబర్’ విభాగంలో గిన్నిస్ వరల్ రికార్డు నమోదైంది. భారత 80వ స్వాంతంత్య్ర దినోత్సవం, అమెరికా 250వ వార్షికోత్సవాన్ని కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.