మెగా డీఎస్సీ 2025 కింద ఉద్యోగాలు సాధించిన నూతన ఉపాధ్యాయులు విజయవాడ నగర వీధుల్లో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన స్వరాజ్ మైదాన్ లోని బిఆర్ అంబేద్కర్ స్మృతివనం వరకు సాగింది. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై ఉపాధ్యాయులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది ప్రతిభతో సాధించిన మెగా డీఎస్సీ అని, దగా ఎస్సీ కాదని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం తమ కష్టాన్ని, ప్రతిభను కించపరచవద్దని హితవు పలికారు.