విశాఖపట్నం పాత విమానాశ్రయం నుంచి ప్రయాణీకుల విమానాల రాకపోకలకు తెరపడింది. విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ సోమవారం నుంచి అందుబాటులోకి రావడంతో, ఆదివారం అర్ధరాత్రి నుంచి విశాఖ విమానాశ్రయంలో పౌర విమాన కార్యకలాపాలను పూర్తిస్థాయిలో నిలిపివేశారు. ఇకపై ఈ విమానాశ్రయాన్ని భారత రక్షణ శాఖ పరిధిలోని ‘తూర్పు నౌకాదళం’ పూర్తిస్థాయిలో తమ వ్యూహాత్మక అవసరాల కోసం ఉపయోగించుకోనుంది.