ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ ప్రోత్సాహానికి విశేష కృషి చేస్తున్న ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పురుషులకు విజయవంతంగా నిర్వహించిన ఆంధ్ర క్రికెట్ సంఘం ఇప్పుడు మహిళలకు కూడా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఏపీ మహిళల ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నట్లు.. సెప్టెంబర్ 15 – 26 వరకు మంగళగిరిలో డేఅండ్ నైట్ మ్యాచ్‌లు జరుగుతాయి భారత మహిళల మాజీ క్రికెట్ మిథాలీ రాజ్ ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరగనుంది.