అమెరికాలోని ప్రముఖ విద్యాసంస్థ వర్జీనియా స్టేట్ యూనివర్సిటీ ప్రాంగణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి వినబడిన తుపాకీ మోతలతో విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది భయాందోళనలతో పరుగులు తీశారు.శుక్రవారం రాత్రి క్యాంపస్‌లోని ‘క్వాడ్ అన్నెక్సెస్’ సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో క్యాంపస్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఆకస్మిక దాడితో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు వర్సిటీ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, క్యాంపస్‌ను పూర్తిగా లాక్డౌన్ చేశాయి.