ఆ మున్సిపల్ స్కూల్లో మాత్రం ఒకే ఒక విద్యార్థి విద్యను అభ్యసిస్తున్నాడు.. స్వతంత్ర దినోత్సవం విశిష్టతను విద్యార్థికి తెలియజేసేందుకు ఒక విద్యార్థి చదివే ఆ స్కూల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే సుమారు 30 మంది వరకు గెస్ట్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పైగా అంగన్వాడి చిన్నారులు కూడా రావడంతో వేడుకలుమరింత ఘనంగా జరిగాయి. పిఠాపురం మున్సిపాలిటీ 14వ వార్డులో గల భాస్కర స్పెషల్ మున్సిపాలిటీ ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యార్థితో జండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.