కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం ఆలాపనను కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అడ్డుకునేందుకు ప్రయత్నించారంటూ బీజేపీ ఆరోపించింది. ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. “వందేమాతం పూర్తి గేయం ఆలాపనపై తల్లి, కుమారుడు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అసంతృప్తిగా కనిపిస్తున్నారు” అంటూ బీజేపీ కార్యదర్శి సంతోష్ వ్యాఖ్యానించారు. ఖర్గే చాలా సేపు నిలబడి ఉండడంతో ఆయనకు కుర్చీ ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ అడిగారని వివరించారు. దానినే బీజేపీ నేతలు వేరే విధంగా ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని జైరాం రమేశ్ మండిపడ్డారు.