మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతుల కుమారుడు వాయువ్ తేజ్ కొణిదెలకు సంబంధించిన వార్తలపై మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా నాగబాబు తన మనవడు వాయువ్ తేజ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో వాయువ్ తన తాతలు నాగబాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్ కలిసి ఉన్న ఫొటోను ఎంతో ఆసక్తిగా చూస్తూ కనిపించాడు. చిన్నారి ఆ ఫొటోను తదేకంగా పరిశీలిస్తున్న ఈ క్యూట్ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.