స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ హై కోర్టు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం,ఢిల్లీ హైకోర్టు,జామ్‌నగర్ హౌస్, ఝండేవాలన్ బిల్డింగ్, సాకేత్ ఆఫీస్, డిస్ట్రిక్ మేజిస్ట్రేట్, ఢిల్లీ మెట్రో, అంబాలకు వెళ్లే రైళ్లు.. సహా ఇతర ప్రాంతాలకు శుక్రవారం బెదిరింపు మొయిల్ వచ్చింది. ఖలిస్థాన్ పేరిటి ఇది వచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.ఈ బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు.అందులో చెప్పిన ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.